1 min read
92 words

చిత్తూరు జిల్లా పీలేరులో ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రకాష్‌పై అమానుషంగా దాడి జరిగింది. తిరుపతిలో బస్సు రద్దీగా ఉందని, మరో బస్సులో రావాలని కండక్టర్ సూచించడంతో వివాదం మొదలైంది. అయినా అదే బస్సులో ఎక్కిన మహిళ..తిరుపతి నుంచి పీలేరుకు జీరో టికెట్ ఇవ్వాలని అడిగింది. ఈ క్రమంలోనే కండక్టర్‌తో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు ఫోన్‌లో చెప్పగా, బస్సు పీలేరు బస్టాండ్‌కు చేరుకోగానే, సదరు మహిళ భర్త, అతని స్నేహితులు కలిసి కండక్టర్‌ను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. ప్రయాణికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినలేదు. బాధిత కండక్టర్ యూనియన్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
RTC Bus : బస్సులో ఖాళీ లేదన్నందుకు ఆర్టీసీ కండక్టర్‌పై దాడి – TV9
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
#rtc #chittoor #tv9telugu #tv9